- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్‌ను మళ్లీ అలా అంటే ఊరుకోం: జగన్‌కు ఎమ్మెల్యే బొలిశెట్టి స్ట్రాంగ్ వార్నింగ్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను దత్త పుత్రుడు అంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు...

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan)ను దత్త పుత్రుడు అంటూ వైఎస్ జగన్(Ys Jagan) చేసిన వ్యాఖ్యలపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్(Janasena MLA Bolisetti Srinivas) ఫైర్ అయ్యారు. పవన్‌ను విమర్శించే ముందు జగన్ తన వ్యక్తిత్వాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. సొంత తల్లికి, చెల్లికి కనీసం న్యాయం చేయలేని జగన్ అసలైన చెత్త పుత్రుడు అని విమర్శించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Ys Rajasekhar Reddy)పై ఉన్న గౌరవంతో ప్రజలు 151 సీట్లు ఇస్తే, తన అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, అందుకే ప్రజలు జగన్‌ను 11 సీట్లకు పరిమితం చేసి బుద్ధి చెప్పారని బొలిశెట్టి ఎద్దేవా చేశారు.
ఇకపై జగన్‌ను అలానే పిలుస్తాం..
ఇకపై పవన్ కల్యాణ్‌ను దత్త పుత్రుడు అని పిలిస్తే, జగన్‌ను ఉత్తర పుత్రుడు, చెత్త పుత్రుడు అని పిలుస్తామని బొలిశెట్టి హెచ్చరించారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్.. ఇప్పుడు మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చిన ఘనత జగన్‌దేనన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో వ్యవహరించి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి విమర్శలు చేయడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే బొలిశెట్టి సెటైర్లు వేశారు.






