- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్‌ను అరెస్ట్ చేస్తారు..జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజలే చెప్పాలని జనసేన నేత, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజలే చెప్పాలని జనసేన నేత, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం మంచి చేస్తుందని ప్రజలు చెప్పకపోతే రప్పా రప్పా గాళ్లు రోడ్డెక్కి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు అలా మాట్లాడుతుంటే మనం ఎక్కడ ఉన్నామని అన్నారు. రోజా ఎమ్మెల్యే నా కొడుకులు అని మాట్లాడుతుందని జగన్ కూడా ఎమ్మెల్యేనే కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కూడా ఎమ్మెల్యేనే అని ఆయన వయసు ఎంత రోజా వయసు ఎంత అని మండిపడ్డారు.
ఒక్కొక్కరి వెనకాల వేల కోట్ల కుంభకోణాలు ఉన్నాయని ఆరోపించారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని, రాబోయే రోజుల్లో జగన్ మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. వీళ్లంతా మామూలు దొంగలు అయితే జగన్ గజదొంగ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ లో మొత్తం దోచుకున్నాడని, గనులు, ఇసుక దోచుకున్నారని ఆరోపించారు. వైసీపీ వాళ్లు మళ్లీ రోడ్లపైకి వస్తున్నారని సంవత్సర కాలంలో ఎవరూ మర్చిపోరని అన్నారు.






