సెన్స్‌లెస్ స్టేట్‌మెంట్స్ చేయొద్దు.. జగన్‌కు నాగబాబు సలహా

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-07-27 16:42:02  IST  )

ఫైల్స్ దగ్ధం కేసులో మాజీ మంత్రి పెద్దిరెద్దిపై ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు....

సెన్స్‌లెస్ స్టేట్‌మెంట్స్ చేయొద్దు.. జగన్‌కు నాగబాబు సలహా
X

దిశ, వెబ్ డెస్క్: ఫైల్స్ దగ్ధం కేసులో మాజీ మంత్రి పెద్దిరెద్దిపై ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలేజీలో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారని, అందువల్లే పగ బట్టి ఇప్పుడు తీర్పుకుంటున్నారని జగన్ ఆరోపణలు చేశారు. దీంతో జగన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికైనా జగన్ మారాలని సోషల్ మీడియాలో నెటిజన్లు, నాయకులు, ప్రముఖులు సెటైర్లు వేస్తు్న్నారు. ఈ నేపధ్యంలో జనసేన పార్టీ నేత నాగబాబు స్పందించారు. జగన్‌కు కీలక సలహా ఇస్తూ ట్వీట్ చేశారు. ‘‘ ఏపీ సీఎం చంద్రబాబు నా బలపం కొట్టేశాడు. నా పెన్సిల్ విరకొట్టాడు. నన్ను గిల్లాడు అని పెద్దయ్యాక పగ తీర్చుకుంటారా ఎవరైనా. ఈ senseless statements ఏంటసలు..?. మీకు సలహాలెవరిస్తున్నారు స్వామి. మీరు మాట్లాడేది మీకైన కామెడిగా లేదా..?. ఇతన్నేనా మనం 2019-2024 వరకు సిఎంగా ఎన్నుకున్నది అని ప్రజలు షాక్‌లో ఉన్నారు. ఇకనైనా మీరు చేసే commentsకి కొంచెం Common sense add చేయండి YCP MLA Jagan గారు.’’ అని నాగబాబు సలహా ఇచ్చారు.

Next Story