- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటికి వస్తే వాస్తవాలు తెలుస్తాయని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. ఉద్యోగస్తుల సమ్మెను ముందుకు తీసుకోవాలని జనసేన ప్రయాత్నించిందని ఆరోపించడం సరికాదన్నారు. తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేలా సీఎం వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఉద్యోగుల పోరాటానికి జనసేన మద్దతు ఇచ్చిందని వాస్తవం అని తెలిపారు. 151 సీట్లు వచ్చిన జగన్‌కు పవన్ కల్యాణ్‌ను చూస్తే ఎందుకు భయమన్నారు. అన్నింటికీ సలహాదారులే సీఎంల పెత్తనం చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ ఇంట్లో కూర్చుని బటన్ నొక్కడానికే పరిమితమని ఎద్దేవా చేశారు. జనసేనపై అవాకులు, చవాకులు పేలితే తిరుగుబాటు తప్పదని ధ్వజమెత్తారు. ఇష్టానుసారంగా మాట్లాడే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
Next Story






