- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ లింక్స్‌ను ఎవరూ క్లిక్ చేయొద్దు: పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసిన జనసేన
జనసేన పార్టీ(Janasena Party)కి చెందిన ఎక్స్ ఖాతాను సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) హ్యాక్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ(Janasena Party)కి చెందిన ఎక్స్ ఖాతాను సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు(Cyber Crime Police) కంప్లైంట్ చేశారు. తాజాగా హ్యాక్ చేసిన వ్యక్తులు యూకే నుంచి అకౌంట్ లాగిన్ చేసినట్లుగా సైబర్ టీమ్ గుర్తించింది. బిట్ కాయిన్, క్రిప్టో ట్రేడింగ్ లింకులు పెట్టి మోసం చేసే యత్నంగా గుర్తించింది. దీంతో జనసేన ఐటీ టీం అకౌంట్‌ను రికవరీ చేసే ప్రయత్నాలు చేస్తోంది. ట్రేడింగ్, బిట్ కాయిన్ లింకులపై ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని పార్టీ శ్రేణులకు, పవన్ కల్యాణ్ అభిమానులకు జనసేన సూచనలు చేసింది. ఇదిలా ఉంటే.. ఈ ఖాతా హ్యాక్ చేసిన అనంతరం ఖాతా ప్రొఫైల్ పిక్చర్‌తోపాటు కవర్ ఫొటోను సైబర్ నేరగాళ్లు తొలగించారు. అలాగే పార్టీకి సంబంధం లేని ఫొటోలు సైతం ఈ ఖాతాలో పెట్టారు. అయితే గతంలో ఈ పార్టీ ఎక్స్ వేదికగా చేసిన పోస్టుల మాత్రం యాథావిథిగా ఉన్నాయి.






