మళ్ళీ కూల్చివేతలు తప్పవు: అమరావతిపై బొలిశెట్టి సంచలనం వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-08 10:28:48  IST  )

జనసేన మాజీ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ రాజధాని అమరావతి నిర్మాణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ, అవినీతిపై తాను రాజీలేని పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు....

మళ్ళీ కూల్చివేతలు తప్పవు: అమరావతిపై బొలిశెట్టి సంచలనం వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన మాజీ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ(Former Jana Sena leader Bolisetty Satyanarayana) రాజధాని అమరావతి(Amaravati) నిర్మాణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ(Environmental protection), అవినీతి(Corruption)పై తాను రాజీలేని పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో గతంలో పర్యావరణ విధ్వంసం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందు వల్లే అప్పట్లో ప్రజావేదికను కూల్చివేయాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో కూటమి నేతలైనా సరే, నిబంధనలు ఉల్లంఘిస్తే తాను వదిలిపెట్టబోనని హెచ్చరించారు.

నిబంధనలకు లోబడి ఉండాల్సిందే..


రాజధాని అమరావతిలో ఏవైనా నిర్మాణాలు చేపడితే అవి ఖచ్చితంగా నిబంధనలకు లోబడి ఉండాలని బొలిశెట్టి డిమాండ్ చేశారు. ఒకవేళ పర్యావరణానికి విరుద్ధంగా కట్టడాలు చేపడితే భవిష్యత్తులో అవి మళ్ళీ కూల్చివేతకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణంలో 84 శాతం సాగు భూములు మరియు పర్యావరణ సున్నిత ప్రాంతాలు ఉన్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు.

ఏ చర్యలనైనా అడ్డుకుంటా..

అమరావతి పరిధిలో ఉన్న నదులు, కాలువలను కలుషితం కాకుండా పరిరక్షించాలని బొలిశెట్టి కోరారు. పర్యావరణానికి హాని కలిగించే ఏ చర్యలనైనా తాను అడ్డుకుంటానని, ఇందుకోసం తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని ప్రకటించారు. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తే ఊరుకోబోనని, రాజధాని నిర్మాణం శాశ్వతంగా ఉండాలంటే పర్యావరణ సూత్రాలను పాటించడం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.

వీడియో

Next Story