Janasena: అల్లవరం జనసేనలో అసమ్మతి.. ‘దిశ’ కథనంపై చర్చోపచర్చలు

by Ramesh Goud |

కోనసీమ జిల్లా అల్లవరం జనసేన పార్టీలో జరుగుతోన్న అసమ్మతి పరిణామాలపై ‘దిశ’ ప్రచురించిన ‘అల్లవరం జనసేనలో అసమ్మతి రాగం.!’ శీర్షికన వచ్చిన కథనంపై జనసేన పార్టీ జిల్లా నాయకత్వం ఆరా తీసినట్లు తెలిసింది.

Janasena: అల్లవరం జనసేనలో అసమ్మతి.. ‘దిశ’ కథనంపై చర్చోపచర్చలు
X

దిశ, అల్లవరం: కోనసీమ జిల్లా అల్లవరం జనసేన పార్టీలో జరుగుతోన్న అసమ్మతి పరిణామాలపై ‘దిశ’ ప్రచురించిన ‘అల్లవరం జనసేనలో అసమ్మతి రాగం.!’ శీర్షికన వచ్చిన కథనంపై జనసేన పార్టీ జిల్లా నాయకత్వం ఆరా తీసినట్లు తెలిసింది. దిశ కథనం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో కూటమి నేతల్లో ముమ్మర చర్చ జరిగింది. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభ్యున్నతికి పాటుపడిన వారికి ఎప్పుడూ సముచిత స్థానం ఉటుందని, ఎటువంటి ఇబ్బందులున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించినట్లు సమాచారం. పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులు.. తాము అందరినీ కలుపుకువెళ్తున్నామని, పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నవారు అంటే తమకు గౌరవమని తెలిపారు. ఏదీ ఏమైనా అల్లవరం మండల పరిధిలో ఏర్పడిన అసమ్మతి సమస్యకు దిశ కథనంతో ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Next Story