- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News: ఈ నెల 22న ఢిల్లీకి పవన్.. ఎందుకో తెలుసా..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 22న ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ పెద్దలను ఆయన కలవనున్నారు. ..

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 22న ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ పెద్దలను ఆయన కలవనున్నారు. పొత్తులు, సీట్లపై చర్చించనున్నారు. అనంతరం అధికారికంగా జనసేన అభ్యర్థులను ప్రకటించనున్నారు. కాగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేనాని దూకుడు పెంచారు. జనసేన నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఆయన సమన్వయకర్తలను నియమించారు. ఈ నెల 22 తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆయన ఖరారు చేయనున్నారు.
టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ, జనసేన పొత్తులో బీజేపీ కూడా కలిసేలా పరిస్థితిలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు హస్తినకు వెళ్లారు. కేంద్రహోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి చర్చించారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా బీజేపీ అధిష్టానాన్ని కలవనున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు, సీట్ల వ్యవహారంపై చర్చించనున్నారు. ఇందుకోసం పవన్ కల్యాణ్ ఈ 22న ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే బీజేపీ 20 అసెంబ్లీ, 7 ఎంపీ స్థానాలు అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత జనసేన సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పలువురు జనసేన నాయకులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
- Tags
- breaking news






