కోలుకున్న పవన్.. మళ్లీ యాత్ర షురూ

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-04-05 14:53:38  IST  )

జనసేన అధినేత పవన్ కల్యాన్ మళ్లీ ప్రజల్లోకి వెళ్లనున్నారు...

కోలుకున్న పవన్.. మళ్లీ యాత్ర షురూ
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో ‘వారాహి విజయ భేరీ’ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభ చేపట్టారు. అయితే ఆయన స్వల్ప అస్వస్థతకు గురికావడంతో తాత్కాలికంగా యాత్రకు విరామం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో ‘వారాహి విజయ భేరీ’ యాత్రను కొనసాగించేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 7న అనకాపల్లిలో సభ నిర్వహించనున్నారు. 8న యలమంచిలిలో యాత్ర కొనసాగిస్తారు. ఈ 9న పిఠాపురంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం నెల్లిమర్ల, విశాఖ దక్షిణం, పెందుర్తి నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

Read More..

ఇటు షర్మిల.. అటు అవినాశ్.. కడపలో ఫ్యామిలీ ఫైట్ షురూ..!



Next Story