వరల్డ్ కప్ తుది పోరులోనూ విజయం సాధించాలి: Pawan kalyan

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-11-15 18:53:59  IST  )

వరల్డ్ కప్‌ సెమీస్‌లో భారత్ ఘన విజయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు...

వరల్డ్ కప్ తుది పోరులోనూ విజయం సాధించాలి: Pawan kalyan
X

దిశ, వెబ్ డెస్క్: వరల్డ్ కప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే భారత్ విజయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వరల్డ్ కప్ తుదిపోరులోనూ ఇదే స్ఫూర్తితో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. మన దేశం క్రికెట్ జట్టు ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో విజయం సాధించి క్రీడాభిమానులకు ఎంతో సంతోషాన్ని పంచిదని చెప్పారు. భారత క్రికెట్ జట్టుకి శుభాకాంక్షలు తెలిపారు. సెమీస్‌లో విజయం సాధించిన తీరు తన జట్టు సత్తాను తెలియజేసిందన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, శుభమన్ గిల్, సిరాజ్.. జట్టులోని ప్రతి ఆటగాడు ఎంతో తపనతో ఆడుతున్నారని చెప్పారు. ప్రపంచ కప్ పోటీలు మొదలు అప్రతిహతంగా విజయాలు నమోదు చేస్తున్నారని పవన్ తెలిపారు. వరల్డ్ కప్ తుది పోరులోనూ విజయం సాధించాలని, కప్పు కైవసం చేసుకుంటారనే విశ్వాసాన్ని పవన్ కల్యాణ్ వ్యక్తం చేశారు.



Next Story