visakha: ఆ పని చేయను.. పార్టీ ఎప్పటికీ ఉంటుంది: పవన్ కల్యాణ్

by Vemula.Srinu Prasad |

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరగాలంటే పొత్తు మాత్రమే మార్గమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు..

visakha: ఆ పని చేయను.. పార్టీ ఎప్పటికీ ఉంటుంది: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరగాలంటే పొత్తు మాత్రమే మార్గమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ ఏఎస్ రాజా కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 2024లో ఏపీ భవిష్యత్తు బంగారుమయం చేయాలని పవన్ కోరారు. సీఎం ఎవరనేది తాను, చంద్రబాబు మాట్లాడుకుంటామని చెప్పారు. కానీ ప్రజల ఆత్మగౌరవాన్ని మాత్రం దెబ్బతీయనని, అన్ని బహిరంగంగా చెప్పే చేస్తానని పవన్ తెలిపారు. డొంకతిరుగుడు పనులు మాత్రం తాను చేయనని పవన్ తేల్చిచెప్పారు. ప్రజారాజ్యంలా జనసేన కనుమరుగుకాదని, ఎప్పటికీ పార్టీని మనుగడలోనే ఉంచుతానని పవన్ హామీ ఇచ్చారు. అభిమానం ఓట్లగా మారాలని.. అలా జరగకపోతే ఎవరూ ఏం చేయలేరని చెప్పారు. జనసేనను గెలిపిస్తేనే ముఖ్యమంత్రి పదవి అడిగే అవకాశం ఉంటుందన్నారు. తాను టీడీపీ వెనుక నడవలేదని, కలిసి నడుస్తున్నానని పవన్ వ్యాఖ్యానించారు. తాను పోటీ చేసే చోట సీఎం జగన్ రూ.కోట్లు పంచుతారని, మార్పు కోసం వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని పవన్ కల్యాణ్ కోరారు.

Next Story