- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2024 Elections: జనసేన కార్యకర్తలకు పవన్ కీలక పిలుపు
ఎన్నికల వేళ జనసేన నాయకులు, కార్యకర్తలకు పవన్ కల్యాణ్ కీలక పిలుపునిచ్చారు...

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం చేయనున్నారు. పిఠాపురం నుంచి ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసేలా ప్లాన్ చేస్తు్న్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని జనసేన నాయకులు, కార్యకర్తలకు చెప్పారు. ఈ మేరకు రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలతో ఆయన చర్చించారు. వారాహి వాహనంపైనే ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించబోతున్నాయని చెప్పారు. ఎన్నికల యుద్ధంలో కచ్చితంగా జనసేన పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేవారు. పిఠాపురం నుంచే తాను ఎన్నికల శంఖారావం పూర్తిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ పన్నాగాలు పన్నుతోందని, వాటన్నింటిని తిప్పికొట్టాలని నాయకులు, కార్యకర్తలకు పవన్ సూచించారు. జనసేన ప్రతి కార్యకర్తల ఎన్నికల్లో విజయం కోసం కృషి చేయాలని కోరారు. సీట్లు దక్కని నాయకులను అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.






