Varahi Yatra: జనాల్లోకి మళ్లీ పవన్ కల్యాణ్.. నాలుగో విడత అక్కడి నుంచే

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-09-16 14:54:38  IST  )

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి యాత్రకు సిద్ధమయ్యారు....

Varahi Yatra: జనాల్లోకి మళ్లీ పవన్ కల్యాణ్.. నాలుగో విడత అక్కడి నుంచే
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి యాత్రకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకూ మూడు విడతల్లో ఆయన వారాహి యాత్ర చేపట్టారు. ఇప్పుడు నాలుగో విడత యాత్రకు తేదీ ఫిక్స్ అయింది. ఈ నెల 21 నుంచి కృష్ణా జిల్లాలో నాలుగో విడత వారాహి యాత్ర చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. 4 నియోజకవర్గాల్లో 5 రోజుల పాటు వారాహి యాత్ర సాగనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ సైతం ఖరారు అయింది. అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం, కైకలూరులో పవన్ వారాహియాత్ర నిర్వహించనున్నారు.

కాగా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన పవన్ .. టీడీపీ‌తో కలిసి వచ్చే ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలిపారు. దీంతో వారాహి యాత్రపై ఆసక్తి నెలకొంటుంది. ఈ యాత్రలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా పాల్గొంటారా..?. లేదా జనసేన నేతలు, కార్యకర్తలు మాత్రమే హాజరవుతారా అనేది చూడాల్సి ఉంది. మరోవైపు పవన్ సభలకు మామూలుగానే ప్రజలు కిక్కిరిపోతారు. ఇప్పుడు టీడీపీతో పొత్తు ప్రకటించారు. దీంతో వారాహి యాత్రకు ఎంత మంది జనాలు వస్తారనే ఆసక్తి పలు పార్టీల్లో కనిపిస్తోంది.

More News : Janasena: సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Next Story