- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC ఎన్నికలు.. తన మద్దతు ఎవరికో తేల్చిచెప్పిన DCM పవన్ కల్యాణ్
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక(Teachers MLC Elections)ల్లో ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అభ్యర్థిగా పోటీచేస్తున్న పాకలపాటి రఘువర్మ(Pakalapati Raghu Varma)కు అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక(Teachers MLC Elections)ల్లో ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అభ్యర్థిగా పోటీచేస్తున్న పాకలపాటి రఘువర్మ(Pakalapati Raghu Varma)కు అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. ఇటీవలే ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు(Chandrababu), మంత్రి లోకేశ్ ఆదేశాలతో మద్దతును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. తాజాగా.. జనసేన(Janasena) పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) సైతం తన మద్దతును పాకలపాటి రఘువర్మకే ఇచ్చారు. ఈ మేరకు శనివారం సాయంత్రం అధికారిక ప్రకటన చేశారు. అంతకుముందు రఘువర్మకు కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖరం మద్దతు ఇస్తున్నారని, దాంతో ఏపీటీఎఫ్-257 కూడా కూటమి అభ్యర్థులకే మద్దతిస్తోందని ఆ సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నుపాటి మంజు, భానుమూర్తి స్పష్టం చేశారు.






