పవన్ కళ్యాణ్‌కి అనారోగ్యం... హైదరాబాద్‌కి పయనం

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-03-31 15:14:38  IST  )

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. ...

పవన్ కళ్యాణ్‌కి అనారోగ్యం... హైదరాబాద్‌కి పయనం
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. వారాహి విజయభేరి పేరుతో పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.అయితే ఈ ప్రచారంలో ఆయన కొద్దిగా నీరసపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన టూర్‌లో స్వల్ప మార్పులు చేశారు. వరుస ప్రచారానికి తొలుత తేదీలను ప్రకటించారు. పవన్ అనారోగ్యం కారణంగా నాలుగు రోజుల పర్యటనను రద్దు చేశారు. కాసేపట్లో పవన్ కల్యాణ్ హెలికాఫ్టర్‌లో హైదరాబాద్‌కి పయనంకానున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత వైద్య పరీక్షలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

కాగా ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో జనసేన పార్టీ పొత్తులో భాగంగా 22 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ మేరకు పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. ప్రస్తుతం అభ్యర్థుల తరపున ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు.

Read More..

Pawan Kalyan: జనసేన శ్రేణుల్లో ఆందోళన.. పవన్‌ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం, హైదరాబాద్‌కు తరలింపు

Next Story