DCM:‘రానున్న రోజుల్లో ఇంకా బలమైన పార్టీగా జనసేన’.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-19 11:55:50  IST  )

ఏపీ(Andhra Pradesh)లో జనసేన పార్టీ(Janasena Party) 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం, చిత్రాడలో మార్చి 14వ తేదీన ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

DCM:‘రానున్న రోజుల్లో ఇంకా బలమైన పార్టీగా జనసేన’.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో జనసేన పార్టీ(Janasena Party) 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం, చిత్రాడలో మార్చి 14వ తేదీన ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. పార్టీ ఆవిర్భావ సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుకునేందుకు, అన్ని విధాలుగా సహకరించి, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేసిన పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్షేత్ర స్థాయిలో పనిచేసిన ప్రతి ఒక్క పోలీస్ అధికారికి, బందోబస్తులో కీలక పాత్ర పోషించిన నా కానిస్టేబుల్ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా వీక్షించేందుకు, కార్యక్రమ సారాంశాన్ని చేరవేసేందుకు అన్ని విధాలుగా సహకరించిన మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, లైవ్ కవరేజ్ అందించిన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీ 11 ఏళ్ల ప్రయాణాన్ని వివరిస్తూ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను, వివరిస్తూ వివిధ డాక్యుమెంటరీలో రూపొందించి వాటిని ప్రజలకు తెలిసేలా ప్రదర్శించిన జనసేన పార్టీ సోషల్ మీడియా(Social Media) విభాగం, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు. ప్రదర్శనలు నిర్వహించారని గుర్తు చేశారు.

తీవ్రమైన ఎండ ఉన్నప్పటికీ, కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి డిహైడ్రేషన్ అవ్వకుండా వారికి దారి పొడవునా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుచేసి పండ్లు, మజ్జిగ, నీరు, ఆహారం అందించిన ఫుడ్ కమిటీ విభాగానికి, స్టేజ్ డెకరేషన్, లైటింగ్, సౌండింగ్ బృందానికి, ప్రతి ఒక్క కార్మికుడికి, కార్యక్రమం అనంతరం ప్రాంగణాన్ని పరిశుభ్రం చేసి, స్వచ్ఛ ఆంధ్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇంకా బలమైన పార్టీగా జనసేన మారుతుందని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు. సామాన్యుల గొంతుకగా, రాష్ట్ర ప్రయోజనాలు, జాతీయ ఐక్యత లక్ష్యంగా మరింత బాధ్యతగా పని చేసే దిశగా అడుగులు వేయనుంది. పార్టీ బలోపేతం కోసం జనసేన శ్రేణులు ప్రజల పక్షాన నిలబడి పని చేయాలి’ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Next Story