- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీలో వివేకం కరువైంది: ఎమ్మెల్సీ నాగబాబు సెటైర్లు
వైసీపీ శ్రేణులే లక్ష్యంగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ నాగబాబు ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు..

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ(Ycp) శ్రేణులే లక్ష్యంగా జనసేన(Janasena) రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ నాగబాబు(Mlc Nagababu) ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అగ్రనేతల నుంచి సామాన్య కార్యకర్త వరకు అందరూ తీవ్ర అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన విమర్శించారు. క్లిష్ట సమయాల్లోనూ సంయమనంతో వ్యవహరించాల్సింది పోయి ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో వైసీపీ కేడర్ ఉందని వైఎస్ వివేకానందరెడ్డి ఇష్యూను పరోక్షంగా ప్రస్తావిస్తూ నాగబాబు ఎద్దేవా చేశారు.
అడ్డదిడ్డంగా వైసీపీ నేతల తీరు
కేవలం అధికారం కోల్పోయామన్న ఆవేదనతోనే కాకుండా పార్టీ భవిష్యత్తుపై స్పష్టత లేక, వైసీపీ నేతలు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని నాగబాబు మండిపడ్డారు. రాజకీయాల్లో విజ్ఞత కన్నా విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్న వైసీపీ నేతలకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని నాగబాబు హెచ్చరించారు. అయితే నాగబాబు చేసిన పోస్ట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






