పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ ఉండాల్సిందే! జనసేన శ్రేణులకు సంచలన సూచన.. పాటించకపోతే అంతే!

by Ramesh Naini |

పార్టీ నాయకులకు జనసేన పార్టీ కీలక అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేసింది.

పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ ఉండాల్సిందే! జనసేన శ్రేణులకు సంచలన సూచన.. పాటించకపోతే అంతే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీ నాయకులకు జనసేన పార్టీ కీలక అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సంచలన ప్రకటన విడుదల చేసింది. జనసేన పార్టీ నాయకులకు విజ్ఞప్తి అంటూ పలు సూచనలు పాటించాలని తెలిపింది. వివిధ రాజకీయ, సామాజిక అంశాలపై పార్టీ నాయకుడు హోదాలో స్పందించే సమయంలో ఖచ్చితంగా కింది సూచనలు పాటించాలని పిలుపునిచ్చింది.

సూచనలు ఇవే..

1. మెడలో తప్పని సరిగా పార్టీ కండువా ఉండాలి.

2. కార్యాలయం లేదా ఇంటి నుంచి వీడియో రికార్డ్ చేసేటప్పుడు వెనుక భాగంలో పార్టీ లోగో, పార్టీ ఎన్నికల గుర్తు, అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఫోటోతో కూడిన ఫ్లెక్సీ ఉండాలి.

3. మాట్లాడే భాష అదుపులో ఉండాలి. ఎటువంటి అసభ్య పదజాలం, బాడీ షేమింగ్ లేకుండా సద్విమర్శ చేస్తూ, పార్టీ గౌరవానికి భంగం కలగకుండా మాట్లాడాలి.

4. ఈ సూచనలు పాటించని ఎడల మీ వ్యాఖ్యలకు పార్టీ ఎటువంటి బాధ్యత తీసుకోదు అనే విషయాన్ని గమనించగలరు.

Next Story