- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనసేన కీలక నిర్ణయం.. కార్యకర్తల కోసం ‘త్రిశూల కార్యక్రమం’
జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కార్యకర్తల కోసం త్రిశూల కార్యక్రమం(Trishula Karyakramam) చేపట్టనుంది. జనసేన కార్యకర్తల గుర్తింపు, నాయకత్వం, భద్రత కోసం త్రిశూల కార్యక్రమం చేపట్టనుంది. ఈ కార్యక్రమాన్ని దసరా తర్వాత ప్రారంభిస్తామని అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రకటించారు. శనివారం జనసేన క్రియాశీల నేతలతో విశాఖ వేదికగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన వల్లే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని చెప్పారు. విశాఖకు రైల్వేజోన్‌ను తీసుకువచ్చామని అన్నారు. కార్యకర్తల్లో స్థైర్యం, స్థిరత్వం కావాలని సూచించారు. అది ఉంటే జాతీయ పార్టీగా జనసేన మారుతుందని అన్నారు. రెండుచోట్లా ఓడిపోయిన తర్వాత అందరూ వెనక్కి వెళ్లిపోతానని భావించారు. ఓ ఓటమితో దశాబ్ధకాలం సినిమాలపై దృష్టి సారించలేకపోయా. అయినా తట్టుకొని నిలబడ్డాం. దాని ఫలితంగానే రికార్డు స్థాయి విజయం సాధించగలిగామని అన్నారు. అధికారం ఉన్నా కాంట్రాక్టులు తీసుకోలేదు అన్నారు. జనసేన లక్ష్యం రాష్ట్రం, దేశం అభివృద్ధే అని అన్నారు. జనసేన నేతలు అందరికీ ఐడియాలజీతో పాటు వ్యూహాలు కూడా ఉండాలని అన్నారు.






