ఉగ్రమృతుడి కుటుంబానికి జనసేన పార్టీ భారీ విరాళం..!

by Ramesh Goud |

పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన ఆంధ్రప్రదేశ్ వాసి సోమిశెట్టి మధుసూదన్ (Somishetti Madhusudan) కుటుంబానికి జనసేన పార్టీ (Janasena Party) భారీ విరాళం (Huge Donation) ప్రకటించింది.

ఉగ్రమృతుడి కుటుంబానికి జనసేన పార్టీ భారీ విరాళం..!
X

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో మరణించిన ఆంధ్రప్రదేశ్ వాసి సోమిశెట్టి మధుసూదన్ (Somishetti Madhusudan) కుటుంబానికి జనసేన పార్టీ (Janasena Party) భారీ విరాళం (Huge Donation) ప్రకటించింది. ఈ మేరకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) కీలక ప్రకటన చేశారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ తరుపున ఉగ్ర మృతులకు నివాళులు (Tributes) అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరై ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉగ్రదాడి పట్ల తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై ఫైర్ అయ్యారు. అలాగే పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేమని, కుటుంబపెద్ద అయిన మధుసూదన్ చనిపోవడం బాధకరమని అన్నారు. మధుసూదన్ కుటుంబాన్ని ఆదుకునేందుకు జనసేన పార్టీ తరుఫున రూ.50 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. డబ్బుతో ప్రాణాలకు విలువ కట్టలేమని, కానీ ఈ సాహయం కుటుంబపెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. అంతేగాక ఈ రోజు ఆర్థిక సహాయం చేసి వదిలేయడం కాకుండా మధుసూదన్ కుటుంబానికి ఏ కష్టం వచ్చిన ఎల్లవేళలా అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.

Next Story