జనసేన దెబ్బ అదుర్స్ .. రంగంలోకి ఏసీబీ డీజీ

by Vemula.Srinu Prasad |

మాజీ మంత్రి వెల్లంపల్లి అవినీతిపై ఏసీబీకి జనసేన పార్టీ ఫిర్యాదు చేసింది...

జనసేన దెబ్బ అదుర్స్ .. రంగంలోకి ఏసీబీ డీజీ
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌(Former Minister Vellampalli Srinivas)కి జనసేన నేతలు(Janasena Leaders) బిగ్ షాక్ ఇచ్చారు. ఆయన మంత్రి ఉన్న మయంలో అవినీతికి పాల్పడ్డారంటూ ఏసీబీడీజీ(ACB DG)కి ఫిర్యాదు చేశారు. అంతేకాదు అక్రమాలకు కూడా పాల్పడ్డారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, ఆధారాలను సైతం సమర్పించింది.

బయటకు వెల్లంపల్లి అవినీతి చిట్టా

కాగా వైఎస్ జగన్(Ys Jagan) హయాంలో వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రి(Endowment Minister)గా పని చేశారు. అయితే ఆ సమయంలో ఆయన అవినీతికి పాల్పడినట్లు విజయవాడ(Vijayawada) జనసేన నేతలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే అధినేత చెప్పడంతో కొన్ని రోజులు ఆగినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ అధినేత, పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో వెల్లంపల్లికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆయన పని సమయంలో జరిగిన అవినీతి చిట్టాను తాజాగా బయటకు తీశారు.

వెల్లంపల్లి అనుచరుల్లో టెన్షన్

ఇక జనసేన నేతల ఫిర్యాదుతో అటు వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచరుల్లో టెన్షన్ నెలకొంది. దేవాదాయ శాఖలో మంత్రిగా పని చేసిన శ్రీనివాస్ చిన్న అవినీతికి కూడా పాల్పడలేదని, ఆయనపై ఒక్క మచ్చ కూడా లేదని అంటున్నారు. కానీ జనసేన ఫిర్యాదులో ఏసీబీడీజీ యాక్షన్ ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జనసేన పార్టీకి తాము సైతం రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించినట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పని తీరుపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. చిన్న అవినీతి జరిగినా ఎడా పెడా వాయించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండే జనసేన నేతలు ఇచ్చిన షాక్‌ను మాజీ మంత్రి వెల్లంపల్లి ఎలా ఎదుర్కోబోతున్నారనే చర్చగా మారింది.

Next Story