- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బనకచర్ల ప్రాజెక్ట్‌పై జనసేన MP కీలక వ్యాఖ్యలు
బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై జనసేన ఎంపీ బాలశౌరి(Balashowry) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై జనసేన ఎంపీ బాలశౌరి(Balashowry) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు పూర్తయితే ఏపీకి చాలా ఉపయోగం అని అన్నారు. దీనికి అడ్డుపడాల్సిన అవసరం లేదని తెలిపారు. విభజన హామీలపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రతీ ఇంటికి శుభ్రమైన నీటిని అందించాలని వెల్లడించారు. జల్ జీవన్ మిషన్‌ను కొనసాగించేందుకు కేంద్రాన్ని నిధులు కోరినట్లు గుర్తుచేశారు. నదుల అనుసంధానం, బనకచర్ల ప్రాజెక్టుపై క్లియర్‌గా చర్చ జరగాలని అన్నారు. లిక్కర్ స్కామ్‌లో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు.
కాగా, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. సుమారు ఆ గంటలకుపైగా విచారణ తర్వాత సిట్ ఆయన్ని శనివారం అరెస్ట్ చేసింది. ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు, సుప్రీం కోర్టు కొట్టేశాయి. ఈ కేసులో ఇప్పటివరకు 12మంది అరెస్ట్ అయ్యారు.






