రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణల దిశగా జనసేన

by Naga Rani Yarlagadda |

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సినీ రంగం నుంచి రాజకీయాలకు వచ్చిన నాయకులలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణల దిశగా జనసేన
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ జనసేన పార్టీ తనకు ప్రత్యేకమైన రాజకీయ స్థానం ఏర్పరచుకుంటూ ముందుకు సాగుతోంది. 2014లో స్థాపించిన జనసేన పార్టీ బహిరంగ సభలలో కనిపించే బలమైన ప్రజాదరణతో పాటు ఎన్నికలలో ప్రదర్శించిన ప్రగతితో రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదుగుతోంది.

పవన్.. ప్రత్యేక రాజకీయ శైలి

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సినీ రంగం నుంచి రాజకీయాలకు వచ్చిన నాయకులలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రసంగాలు, యువతకు చేరువైన భాష, సామాజిక సమస్యలపై తీసుకుంటున్న ధృఢమైన వైఖరి పార్టీకి విశేషమైన ప్రజాదరణను తెచ్చిపెట్టింది. స్వతంత్రంగా 2019 ఎన్నికల్లో పోటీ చేసిన పరిమితమైన ఫలితాలు వచ్చినా పార్టీకి ఉన్న భవిష్యత్తు సామర్థ్యం స్పష్టమైంది. మరోవైపు 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పెద్ద సక్సస్ సాధించడంతో జనసేన రాజకీయ పటంలో నిర్ణాయక శక్తిగా నిలిచిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజా పరిస్థితి...పార్టీ బలోపేతం

2025–26 రాజకీయ సంవత్సరానికి పార్టీ భారీగా విస్తరణ కార్యక్రమాలు చేపట్టింది. మండల స్థాయికి కొత్త కమిటీల ఏర్పాటు, బూత్ స్థాయిలో జనసేన సైనికుల మద్దతు పెంపు, యువత, మహిళలు, ఉద్యోగార్థులు, ప్రతి వర్గానికీ ప్రత్యేక విభాగాలు పార్టీ సమాజం మొత్తం ప్రయోజనం అనే సిద్ధాంతం వల్ల, స్థానిక సమస్యలపై వేగంగా స్పందించడం వల్ల జనసేన గ్రామాల్లో కూడా తన ప్రభావాన్ని పెంచుకుంటోంది.

పరిపాలనలో పాత్ర...

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత, పవన్ కల్యాణ్ పరిపాలనలో కీలక పాత్రను పోషిస్తుండటం ప్రజల అంచనాలు మరింత పెరిగాయి. ఉద్యోగాలు, విద్యా సంస్కరణలు, వ్యవసాయం, చట్టవ్యవస్థ లాంటివి జనసేన బాధ్యతగా చేపట్టాలని ప్రజలు ఆశిస్తున్నారు.

విపక్ష పార్టీల ప్రతిస్పందన..

జనసేనకు పెరుగుతున్న ప్రజాదరణను ఇతర పార్టీలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. కూటమి బలపడటం వల్ల రాష్ట్రంలో రాజకీయ పోటీ విధానం పూర్తిగా మారిపోయింది. విపక్షాలు జనసేనను యువత ఆధారిత మాంత్రిక శక్తిగా చూస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఇక జనసేన పార్టీని పక్కన పెట్టి ఏ రాజకీయ లెక్కలు కట్టడం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2029 ఎన్నికలలో జనసేన మరింత కీలక పాత్ర పోషించవచ్చని, పార్టీ గ్రౌండ్ నెట్‌వర్క్, పవన్ కల్యాణ్ వ్యక్తిగత ఇమేజ్, ప్రభుత్వంతో అనుసంధానం ఇవన్నీ పార్టీని మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. జనసేన పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో కేవలం ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కాదని, రాజకీయ సమీకరణలను ప్రభావితం చేసే నిర్ణాయక శక్తిగా ఎదుగుతుంది.

పంచాయితీ ఎన్నికలపైప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో జరుగనున్న పంచాయితీ ఎన్నికలపై జనసేన ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికలు సమిపిస్తున్న తరుణంలో గ్రామాల్లో పార్టీ బలోపేతంపై అధిష్టానం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి నాయకులకు బాధ్యతలను అప్పగించింది.

Next Story