- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేర్ని నాని ఓ తోక తెగిన కోతి: జనసేన ఎమ్మెల్యే సెటైర్లు
మాజీ మంత్రి పేర్ని నాని ఓ తోక తెగిన కోతి అని జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ విమర్శించారు..

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని(Ycp Leader Perni Nani) ఓ తోక తెగిన కోతి అని జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్(Janasena Mla Vijay kumar) విమర్శించారు. థియేటర్ల(Theatres) బంద్, పవన్ సినిమా(Pawan Movie) అంశంపై చేసిన విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న సమయంలో సినిమా వాళ్లను పేర్ని నాని ఎలా బ్లాక్ మెయిల్ చేశారో, అవమానించో అందరికి తెలుసని ఎద్దేవా చేశారు. సినిమా థియేటర్ల సమస్య వైసీపీ హయాంలో కూడా ఉందని గుర్తు చేశారు. అప్పుడు ఆ సమస్యను పేర్ని నాని ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. సినిమాలపై పవన్ కంటే పేర్ని నాని ఎక్కువ తెలుసా అని నిలదీశారు.పేర్ని నాని వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు చాలా కథలు చెప్పారని సెటైర్లు వేశారు. నీతి సూక్తులు ఎవరికీ చెప్పాల్సిన పని లేదన్నారు. పవన్ కల్యాణ్ పై మాట్లాడాల్సిన అవసరం కూడా పేర్ని నానికి లేదన్నారు. వ్యవస్థలను స్వార్థానికి వాడుకున్న వారిని వదిలిపెట్టేదిలేదని విజయ్ కుమార్ హెచ్చరించారు.






