ఎన్నికల్లో అక్రమాలు.. చిక్కుల్లో జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-04 10:29:24  IST  )

నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఫిర్యాదు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది...

ఎన్నికల్లో అక్రమాలు.. చిక్కుల్లో జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి
X

దిశ, వెబ్ డెస్క్ : నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి(Nellimarla Jana Sena MLA Lokam Nagamadhavi) ఎన్నికల(Elections) అక్రమాలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఫిర్యాదు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమెకు చెందిన 'మిరాకల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్' సంస్థ ద్వారా 2024 ఎన్నికల సమయంలో భారీగా నగదు మళ్లించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగి ఆనంద్ పక్కా సాక్ష్యాధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు సుమారు 300 మంది ఉద్యోగుల ఖాతాల్లోకి జీతంతో పాటు అదనంగా రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు జమ చేసి, ఆ తర్వాత ఆ మొత్తాన్ని నగదు రూపంలో వెనక్కి తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ 'శాలరీ రౌండ్ ట్రిప్పింగ్' పద్ధతి ద్వారా ...

ఈ 'శాలరీ రౌండ్ ట్రిప్పింగ్' పద్ధతి ద్వారా సేకరించిన కోట్లాది రూపాయలను ఎమ్మెల్యే నాగమాధవి ఎన్నికల ఖర్చుల కోసం అక్రమంగా వినియోగించారని బాధితుడు ఆరోపించారు. సాధారణంగా చూపించే అధికారిక ఎన్నికల వ్యయానికి, క్షేత్రస్థాయిలో జరిగిన వాస్తవ ఖర్చులకు పొంతన లేదని, ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలను అడ్డం పెట్టుకుని నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారని ఫిర్యాదులో వివరించారు. ఈ తీవ్రమైన ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో సాఫ్ట్‌వేర్ కంపెనీ ముసుగులో జరిగిన ఈ 'క్యాష్ బ్యాక్' వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Next Story