సుబ్బారెడ్డే ఒప్పుకొన్నారు.. ఇంకా ఎందుకు డ్రామాలు: ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

by Vemula.Srinu Prasad |

కల్తీ నెయ్యి వినియోగించామని సుబ్బారెడ్డే ఒప్పుకొన్నారని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ధృవీకరించినా .. వైసీపీ నాయకులు డ్రామాలు మాత్రం ఆగడం లేదన్నారు...

సుబ్బారెడ్డే ఒప్పుకొన్నారు.. ఇంకా ఎందుకు డ్రామాలు: ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
X

దిశ, వెబ్ డెస్క్: కల్తీ నెయ్యి వినియోగించామని వైవీ సుబ్బారెడ్డే(Yv Subbareddy) ఒప్పుకొన్నారని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్(Jana Sena MLA Bolisetty Srinivas) అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ధృవీకరించినా .. వైసీపీ నాయకులు డ్రామాలు మాత్రం ఆగడం లేదన్నారు. లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో రసాయనాలు కలిపారని సిట్ తన నివేదికలో చెప్పినా... సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని రోడ్లు ఎక్కుతున్నారని మండిపడ్డారు. నెయ్యిలో కల్తీ జరిగిందని సుబ్బారెడ్డే ఒకవైపు ఒప్పుకుంటే... తప్పును ఏదో రకంగా బుకాయించాలని రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోపించారు. సొంత బాబాయ్ వివేకానందారెడ్డి హత్య దగ్గర నుంచి ఆ పార్టీ నాయకుల డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు.

జల్ జీవన్ మిషన్ పథకానికి జీవం పోశారు

‘‘గత వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని నీరుగార్చింది. కేంద్ర ప్రభుత్వ నిధులను పనులు చేయకుండా మురగపెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్రంతో పవన్ కల్యాణ్ , చంద్రబాబు నాయుడు చర్చించి జల్ జీవన్ మిషన్‌కు జీవం పోశారు. రైతులకు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటోంది. ధాన్యం కొలుగోలు చేసిన 24 గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. కష్టాల్లో ఉన్న కోకో, మామిడి, ఉల్లి రైతులకు మద్దతు ధర ప్రకటించి ఆదుకున్నాం. గిరిపుత్రులకు డోలీ మోతలు లేకుండా ఉండాలని అడవి తల్లి బాట కార్యక్రమం కింద మారుమూల గిరిజన గ్రామాల్లో రోడ్లు వేస్తున్నాం. పోలవరం పరుగులు పెట్టిస్తున్నాం. అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. విశాఖ స్టీల్ ఫ్లాంట్ లాభాల బాట పట్టింది. చెప్పిన మాట ప్రకారం సామాజిక పెన్షన్ ఒకే సారి వెయ్యి పెంచి రూ.4 వేలు అందిస్తున్నాం. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.’’ అని బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు.

Next Story