- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లు అర్జున్‌ను CM రేవంత్ రాకి రాంపాన పెట్టారు.. జనసేన నేత ఆసక్తికర ట్వీట్
బెంగళూరు(Bengaluru)లోని చిన్నస్వామి మైదానంలో జరిగిన తొక్కిసలాటపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ(Bolisetti Satyanarayana) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు(Bengaluru)లోని చిన్నస్వామి మైదానంలో జరిగిన తొక్కిసలాటపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ(Bolisetti Satyanarayana) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) పోస్టు పెట్టారు. ‘హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఎవరి వైఫల్యం వల్ల జరిగింది అనేది పక్కన పెడితే.. ఒక ప్రాణం పోయింది అనేది వాస్తవం. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. నటుడు అల్లు అర్జున్(Allu Arjun)ను బాధ్యుడ్ని చేసి రాకి రాంపాన పెట్టారు. సరిగ్గా నిన్న కర్ణాటకలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. చిన్నస్వామి మైదానంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సేమ్ అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి స్పందన ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. ప్రమాదాలు జరిగినప్పుడు ఎదుటి వారిపై నిందలు వేయడం కంటే ముందు.. తప్పు ఎక్కడ జరిగింది అనేది వెతకాలి. ఆ తప్పు మళ్ళీ జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కక్ష సాధింపు ధోరణి మంచిది కాదు. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరుగకుండా చూడాలి. భద్రతా నియమాలు, ట్రాఫిక్ నియంత్రణతో ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి.. బాధ్యతగా వ్యవహారించాలి’ అని బొలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు.
ఎవరి వైఫల్యమో ప్రక్కన పెడితే పుష్ప 2 సినిమా విడుదల రోజున ఒక నిండు ప్రాణం బలయ్యింది.. అప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి అల్లు అర్జున్ గారిని భాద్యున్ని చేసి రాసి రాంపాన్న పెట్టారు..
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) June 5, 2025
నిన్న కర్ణాటకలో క్రికెట్ సంబరాలలో జరిగిన తొక్కిసలాటలో 11 నిండు ప్రాణాలు… pic.twitter.com/g8LguIh3XI






