- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన నేతలు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు జనసేన నేతలు ఫిర్యాదు చేశారు....

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా(Social Media)లో రాజకీయ నాయకులపై అనుచిత పోస్టులు(Inappropriate posts) ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ పోస్టులపై చాలా కేసుల నమోదు చేసి నిందితులను పోలీసులు జైళ్లకు పంపారు. అయినా మార్పు రావడంలేదు. తాము అభిమానించే నాయకులు, హీరోల కోసం ఇతరుపై బురదచల్లే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు మరోలా ఉన్నా... ఏపీలో మాత్రం సోషల్ రచ్చ విచ్చలవిడిగా ఉంది.
శనివారం ఉదయం విశాఖలో యోగా డే(Yoga Day) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan), మంత్రి లోకేశ్(Minister Lokesh), తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. అయితే కొందరు దుండగులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారు. విశాఖలో డీసీఎమ్ యోగా చేస్తూ రిలాక్స్ అవుతున్నారంటూ పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. దీంతో పిఠాపురం జననేత నేతలు సిరియస్ అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సోషల్ మీడియాలో పోస్టుల జిరాక్స్ పేపర్లను అందజేశారు. నిందితులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు. దీంతో పవన్‌పై అనుచిత పోస్టులను పోలీసులు పరిశీలించారు. కేసులు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టబోతున్నారు.






