- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్‌కు జీవితాంతం రుణపడి ఉంటా: జనసేన నేత ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని జనసేన నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan)కు తాను జీవితాంతం రుణ పడి ఉంటానని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్(Tirupati Jana Sena leader Kiran Royal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్ష్మిరెడ్డి(Lakshmireddy) వివాదంపై ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు, లక్ష్మిరెడ్డికి ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయని, ఆమెను రాజకీయాల్లో లాగి హింసకు గురి చేశారని మండిపడ్డారు. తాను మొండోడిని కాబట్టి నిలబడ్డానని, ఇంకెవరైనా అయితే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేదని చెప్పారు. తనపై ఎవరు కుట్ర చేశారో బాగా తెలుసని, ఆ విషయాన్ని పవన్ కల్యాణ్ దగ్గర ఆధారాలతో సహా ఉంచుతానన్నారు. ఒక సామాన్యుడిగా తిరుపతి(Tirupati)లో తాను రాజకీయాలు చేయకూడదా? అని ప్రశ్నించారు. మీడియా లేకపోతే తాను ఇలా ఉండేవాడిని కాదని, తనను, తన కుటుంబాన్ని హింసించారని కిరణ్ రాయల్ ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు కొన్ని మార్ఫింగ్ చేశారని కిరణ్ రాయల్ ఆరోపించారు. తనను టార్గెట్ చేసిందెవరో తనకు తెలుసన్నారు. వైసీపీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు కావాలనే చేశారని వ్యాఖ్యానించారు. జనసేన నేతలు పాత్ర కూడా 10 శాతం ఉందన్నారు. ఇక నుంచి కొత్త రాజకీయాలు చేస్తానని తెలిపారు. కిరణ్ రాయల్‌కు ఇన్ని రోజులు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయని, ఇప్పుడు హైవేలోకి వచ్చేశానని చెప్పారు. తనపై ఆరోపణలు ఏమీ లేవని, ఈ 26 రోజుల్లో చాలా నేర్చుకున్నానని కిరణ్ రాయల్ తెలిపారు. రాజకీయాల్లో పక్కనున్న వ్యక్తులను కూడా నమ్మకూడదని తనకు తెలిసిందని చెప్పారు. తాను ఏ తప్పు చేయలేదని, ఇదంతా రాజకీయ కుట్ర అని తనకు తెలుసుని తెలిపారు. మహిళను అడ్డంపెట్టుకుని రాజకీయం చేశారని కిరణ్ రాయల్ ఆవేదన వ్యక్తం చేశారు.






