- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్తీ నెయ్యి ఘటనలో ఆయన్ను ఎందుకు వదిలేశారు: జనసేన నేత సంచలన డిమాండ్
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో జనసేన నేత కిరణ్ రాయల్ కీలక డిమాండ్ చేశారు..

దిశ,వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ(Tirumala Laddu) తయారీలో కల్తీ నెయ్యి కలిసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును సిట్(Sit) విచారిస్తోంది. పలుమార్లు తిరుమలలో తనిఖీలు నిర్వహించారు. పలువురి వాంగ్మూలాలు తీసుకున్నారు. నెయ్యి(Ghee) సరఫరా చేసిన సంస్థలు, ఒప్పందం కుదర్చుకున్న వారిని విచారించారు. పలువురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇంకా విచారణ కొనసాగుతోంది. అయితే అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డిని విచారించకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వెంటనే ఆయన్ను కూడా విచారించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ప్రధానంగా ఈ అంశాన్ని తిరుపతి జనసేన పార్టీ రైజ్ చేసింది. ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. కల్తీ నెయ్యి ఘటనలో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి(TTD Former EO Dharma Reddy)ని ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం హాయంలో కల్తీ జరిగితే టీటీడీ ఈవోగా ఉన్న ఆయన నుంచి వివరణ తీసుకోరా అని నిలదీశారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన వారిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. లడ్డూను కల్తీ చేయాలనుకోవడం ముమ్మాటికీ హిందూమతంపై దాడేనని తేల్చి చెప్పారు. ఇక ఈ కేసులో గత బోర్డు సభ్యులను కూడా విచారించాలని జనసేన నేత కిరణ్ రాయల్(JanaSena leader Kiran Royal) డిమాండ్ చేశారు.






