మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు పేరిట తప్పుడు ట్వీట్.. జనసేన ఫిర్యాదు

by Ramesh Naini |   (  Updated:2026-03-03 14:31:10  IST  )

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అంశం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారింది.

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు పేరిట తప్పుడు ట్వీట్.. జనసేన ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అంశం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ఓ మహిళతో టీటీడీ చైర్మన్ సన్నిహితంగా ఉన్నారంటూ ఓ వీడియో రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ వీడియోను మార్ఫింగ్ చేశారంటూ టీటీడీ చైర్మన్ ఖండించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ చైర్మన్ వ్యవహారంలో మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు పేరిట తప్పుడు ట్వీట్ చేశారని జనసేన నేత వి.నారాయణరావు ఆరోపించారు. చైర్మన్‌పై నాదెండ్ల భాస్కరరావు ట్వీట్ చేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోందని పోలీసులకు ఆయన తెలిపారు. ఆ పోస్టుకు నాదెండ్ల భాస్కరరావుకు సంబంధం లేదని మంగళవారం తెనాలి వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. భాస్కరరావుకు ట్విట్టర్ అకౌంట్‌ లేదని ఫిర్యాదులో నారాయణరావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తెనాలి వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Next Story