Breaking: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై జనసేన నేత బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-06-29 15:33:35  IST  )

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు..

Breaking: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై జనసేన నేత బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీనారాయణ మేధావి కాదని, రాజకీయ నాయకుడు అంతకంటే కాదన్నారు. లక్ష్మీనారాయణ రిక్వెస్ట్ చేస్తే టికెట్ ఇచ్చామని, ఆయన తెలివితేటలు చూసి ఇవ్వలేదని బొలిశెట్టి సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాగా జేడీ లక్ష్మీనారాయణ గతంలో జనసేనలో పని చేశారు. 2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జనసేన పార్టీకి రాజీనామా చేశారు. కొంత కాలంగా ప్రజల్లో తిరుగుతూ మళ్లీ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ పార్టీలో చేరతారనేదానిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story