Jana Sena: ఆ వీర మహిళను పూలమాలతో ఆహ్వానించండి.. పవన్ కళ్యాణ్ ఆదేశాలు

by Ramesh Goud |   (  Updated:2024-11-04 12:45:29  IST  )

ఆ వీర మహిళ(Veera Mahila)ను పూలమాలతో ఆహ్వానించాలని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి(Janasena Party Office) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఆదేశాలు(Orders) ఇచ్చారు.

Jana Sena: ఆ వీర మహిళను పూలమాలతో ఆహ్వానించండి.. పవన్ కళ్యాణ్ ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆ వీర మహిళ(Veera Mahila)ను పూలమాలతో ఆహ్వానించాలని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి(Janasena Party Office) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఆదేశాలు(Orders) ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు రాజేశ్వరి(Rajeshwari) అనే వీర మహిళ కర్నూల్ జిల్లా(Kurnool District)లోని ఆదోని(Adoni) నుంచి మంగళగిరి(Mangalagiri) జనసేన పార్టీ కార్యాలయానికి 487 కి.మీ వారాహి సైకిల్ యాత్ర చేపట్టింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి తమ ప్రాంత సమస్యలు విన్నవించాలని ఆగకుండా సైకిల్ తొక్కుకుంటూ వస్తోంది. దీనిని జనసేన కార్యకర్తలు(Janasena Cadre) వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. పార్టీ కార్యాలయానికి వచ్చే ఆ వీర మహిళకు పూలమాలతో స్వాగతం పలకాలని జనసేన కార్యాలయానికి సూచించారు. అంతేగాక సైకిల్ యాత్ర చేపట్టిన ఆమెకు జనసేన నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా స్వాగతం పలకాలని చెప్పారు.

Next Story