స్పీకర్ అయ్యన్నపై జనసేన కార్పొరేటర్ సంచలన ఆరోపణలు.. సమగ్ర విచారణకు లేఖ

by Vemula.Srinu Prasad |

స్పీకర్ అయ్యన్నపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు...

స్పీకర్ అయ్యన్నపై జనసేన కార్పొరేటర్ సంచలన ఆరోపణలు.. సమగ్ర విచారణకు లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోనే విశాఖ అభివృద్ధి చెందిన సిటీగా పేరుంది. అక్కడ భారీ సంస్థలు సైతం ఉన్నాయి. దీంతో విశాఖ(visakha)తోపాటు పరిసర ప్రాంతాల్లోని భూములు వందల, వేల కోట్లు పలుకుతున్నాయి. దీంతో కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనపడితే చాలు డేగల్లా వాలిపోతున్నారు. యదేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. అమ్ముకుంటున్నారు. అయితే ఆర్మీ మాజీ సైనికులకు చెందిన భూములకు ఎన్‌ఓసీ ఇచ్చేందుకు అక్రమాలు జరుగుతున్నాయని విశాఖ కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. అంతేకాదు ఈ అక్రమాల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేరు ప్రస్తావించారు.

దీంతో అయ్యన్నపాత్రుడు స్పందించారు. విశాఖలో జరుగుతున్న భూ ఆక్రమణలపై మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు లేఖ రాశారు. ఎండాడ-2లోని 5.10 ఎకరాల భూమికి ఎన్వోసీ జారీ ప్రక్రియపై సమగ్రంగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story