జనసేన అభ్యర్థి లోకం మాధవి ఫుల్ రిచ్.. వామ్మో అన్ని ఆస్తులా..!

by Disha Web Desk 16 |
జనసేన అభ్యర్థి లోకం మాధవి ఫుల్ రిచ్.. వామ్మో అన్ని ఆస్తులా..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆస్తుల వివరాలు బయటకు వస్తున్నాయి. కొందరి ఆస్తుల విలువలు చూస్తుంటే కళ్లు చెదిరిపోతున్నాయి. వందల కోట్లకు పైగానే అభ్యర్థుల పేరిట ఆస్తులు ఉంటున్నాయి. జనసేన పార్టీ విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ అభ్యర్థి లోకం నాగ మాధవి ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను ఆమె వెల్లడించారు. మొత్తం రూ. 894 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో మాధవి వివరించారు. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీతోపాటు విద్యా సంస్థలు, భూములు, నగదు, బ్యాంకు డిపాజిట్ల రూపంలోనూ ఆస్తులు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఓ బ్యాంకులో రూ. 4.41 కోట్లు, తన వద్ద రూ.1.15 లక్షల క్యాష్ ఉన్నట్లు వివరించారు. చర ఆస్తుల రూపంలో రూ. 856.57 కోట్లు, స్థిర ఆస్తుల రూపంలో రూ.15.70 కోట్లు ఉన్నాయని ఆమె ఎన్నికల ఆఫిడవిట్‌లో దాఖలు చేశారు. అలాగే రూ.2.69 కోట్ల మేర అప్పులున్నట్లు లోకం నాగ మాధవి పేర్కొన్నారు.

Read More..

Breaking: పవన్ కల్యాణ్‌కు జ్వరం.. ఉపిరితిత్తుల్లో నిమ్ము



Next Story

Most Viewed