- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుర్చీలతో కొట్టుకున్న జనసైనికులు
మామూలుగా ఫంక్షన్లలో కుర్చీలతో కొట్లాడుకోవడం చూస్తుంటాము.. రాజకీయాల్లో కూడా కుర్చీల కోసం కొట్లాటే కాకుండా కుర్చీలతో కొట్లాడుకోవడం కూడా ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్ : మామూలుగా ఫంక్షన్లలో కుర్చీలతో కొట్లాడుకోవడం చూస్తుంటాము.. రాజకీయాల్లో కూడా కుర్చీల కోసం కొట్లాటే కాకుండా కుర్చీలతో కొట్లాడుకోవడం కూడా ఉంటుంది. నేతలు పదవీ బాధ్యతలనే కుర్చీల కోసం గొడవపడుతుంటే.. కార్యకర్తలు సమావేశాలు, కార్యక్రమాల్లో కుర్చీలిచ్చుకొని కొట్టేసుకుంటూ కనిపిస్తుంటారు. అటువంటి ఘటనే గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం ఇప్పటంలో (Ippatam) జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యా్ణ్ (Pawan Kalyan) గతంలో ఇప్పటం పర్యటన చేశారు. ఆ సమయంలో ఇండ్ల నాగేశ్వరమ్మ (Indla Nageshwaramma) అనే మహిళ ఇంటికి మళ్లీ వస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు నాగేశ్వరమ్మ నివాసానికి విచ్చేస్తున్నారు. మంగళవారం నాడు పర్యటన వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
అయితే ఆకస్మికంగా బుధవారం ఉదయం డిప్యూటీ సీఎం పర్యటన ఖరారైంది. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనకు ముందే కుర్చీలతో కొట్లాట జరిగింది. పవన్ కళ్యాణ్ పర్యటనను పురస్కరించుకొని పార్టీ శ్రేణులు ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడ పార్టీ తరపున డిప్యూటీ సీఎం పర్యటనకు సంబంధించిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ తనిఖీలు కూడా నిర్వహించారు.
చక్కగా పూలతో ఆహ్వాన ముగ్గును కూడా వేశారు. అంతా సజావుగా సాగుతుందనుకున్న క్రమంలో జనసైనికుల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. రెండు వర్గాలుగా విడిపోయిన జనసైనికులు దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారు. ఇది చూసిన స్థానికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇతర నాయకులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
గొడవ బాగా ముదరడంతో అక్కడ వేసి కుర్చీలను అందుకొని మరీ కొట్టుకున్నారు జనసైనికులు. పోలీసులు కలగజేసుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయినా డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పర్యటిస్తున్నాడంటే ఎంతో క్రమశిక్షణతో ఉండాలి. అలాంటి జనసైనికులు ఇలా దెబ్బలాడుకోవడం విమర్శలకు తావిస్తోంది.






