- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీకి చెందిన వైద్యుడికి జమైకా అత్యున్నత పురస్కారం
by Thanuru Gopichand |
ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన వైద్యుడు నాగమల్లేశ్వర రావు జమైకాలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ఆర్డర్ ఆఫ్ డిస్టింక్షన్ (Order Of Distinction) అందుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన వైద్యుడు నాగమల్లేశ్వర రావు జమైకాలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ఆర్డర్ ఆఫ్ డిస్టింక్షన్ (Order Of Distinction) అందుకున్నారు. అక్టోబరు 20న జరిగిన నేషనల్ హీరోస్ డే సందర్భంగా జమైకా ప్రధాని ఆండ్రూ హెల్నెస్ ఈ పురస్కారాన్నీ (Award) అందజేశారు. ఈ నేపథ్యంలో కింగ్ స్టన్ లోని భారత రాయబార కార్యాలయంలో నాగమల్లేశ్వరరావుకు అభినందనలను తెలియజేసింది. 2005లో జమైకా వెళ్ళిన ఆయన అక్కడ పేదల వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. చందోలు హెల్త్ కేర్ ప్రాక్టీస్ అనే సంస్థ స్థాపించి దాని ద్వారా వైద్య శిబిరాలను (Health Camps) నిర్వహించారు. జమైకాలో అతి తక్కువ కన్సల్టేషన్ ఫీజు తీసుకునే డాక్టరుగా గుర్తింపు పొంది ఫైవ్ బిల్స్ డాక్టర్ అని జమైకాన్లతో ప్రేమగా పిలిపించుకుంటున్నారు.
Next Story






