Jallikattu : తిరుపతిలో జల్లికట్టు.. ఆరుగురు యువకులకు తీవ్ర గాయాలు

by Muthe.Rajitha |   (  Updated:2025-01-13 12:32:43  IST  )

తిరుపతి(Tirupati)లో జోరుగా జల్లికట్టు)Jallikattu) కొనసాగుతోంది.

Jallikattu : తిరుపతిలో జల్లికట్టు..  ఆరుగురు యువకులకు తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి(Tirupati)లో జోరుగా జల్లికట్టు)Jallikattu) కొనసాగుతోంది. సంక్రాంతికి ఏపీ(AP)లో కోడి పందాలు(Kodi Pandalu) ఎలా జరుపుతారో తమిళనాడు(Tamilanadu)లో జల్లికట్టు అలాగే జరపడం ఆనవాయితీ. అయితే ఏపీ, తమిళనాడు బార్డర్ లోని ప్రాంతాల్లో ఎక్కువగా జల్లికట్టు నిర్వహిస్తారు. ఈ సంక్రాంతిని పురస్కరించుకొని తిరుపతిలో భారీగా ఎత్తున జల్లికట్టు నిర్వహిస్తున్నారు. తిరుపతి పట్టణంలోని రామచంద్రపురంలో 600 ఎద్దులతో భారీగా జల్లికట్టు నిర్వహిస్తుండగా.. ఆ ఎద్దులకు కట్టిన పలకాలను పట్టుకునేందుకు యువకులు పోటి పడుతున్నారు. కాగా పలకలను పట్టుకునేందుకు ప్రయత్నించి, పలువురు యువకుల ఎద్దుల కాళ్ళ కింద పడ్డారు. వీరిలో ఆరుగురు యువకులకు గాయాలు గగకాగా స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story