పోలవరం-బనకచర్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు

by Ajay Maddhiboyina |

పోల‌వ‌రం- బ‌న‌క‌చ‌ర్ల‌పై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పోల‌వ‌రం-బ‌న‌క‌చ‌ర్ల నిర్మాణం కోసం జ‌ల‌హార‌తి కార్పొరేష‌న్ ఏర్పాటు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

పోలవరం-బనకచర్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు
X

దిశ‌, వెబ్ డెస్క్: పోల‌వ‌రం- బ‌న‌క‌చ‌ర్ల‌పై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పోల‌వ‌రం-బ‌న‌క‌చ‌ర్ల నిర్మాణం కోసం జ‌ల‌హార‌తి కార్పొరేష‌న్ ఏర్పాటు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. 100 శాతం ప్ర‌భుత్వ సంస్థ‌గా కార్పొరేష‌న్ ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే బనకచర్ల ప్రాజెక్టు ఏపీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. బనకచర్ల ప్రాజెక్టుతో గోదావరినీటిని ఏపీకి తరలిస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. బనకచర్ల నిర్మాణాన్ని ఆపేయాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఏపీ సర్కార్ తెలంగాణకు బనకచర్లతో ఎలాంటి నష్టం లేదని చెబుతోంది. కావాలంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ కలిసి హైదరాబాద్ మరియు ఢిల్లీ వేధికగా అఖిలపక్షం ఆధ్వర్యంలో చర్చిద్దామని సూచిస్తోంది. గత ప్రభుత్వంలో వర్షపు నీరు సముద్రంలోకి వృథాగా పోకుండా కేసీఆర్, జ‌గ‌న్ ఈ ప్రాజెక్టుకు రూప‌క‌ల్ప‌న చేశార‌ని ఆరోపిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ నాయ‌కులు కావాల‌నే రాజ‌కీయం చేస్తున్నార‌ని మండిప‌డుతోంది.

Next Story