ఏపీలో కులరాజకీయాలు చేసేవారికే పట్టం కడుతున్నారు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

విశాఖ స్టీల్ ప్లాంట్ విష‌యంలో అన్యాయం జ‌రుగుతుంద‌ని తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి అన్నారు. విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో జ‌గ్గారెడ్డి మాట్లాడారు.

ఏపీలో కులరాజకీయాలు చేసేవారికే పట్టం కడుతున్నారు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ విష‌యంలో అన్యాయం జ‌రుగుతుంద‌ని తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి అన్నారు. విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో జ‌గ్గారెడ్డి మాట్లాడారు. కులాల మీద రాజకీయం చేసే వారికే ఏపీ ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డుతున్నార‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌లు వారి జీవితాల‌ను వారే ఆగం చేసుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ ఇచ్చిన విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌జ‌ల మీద‌నే ఉంద‌ని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఇంకా రోడ్డుపైనే కూర్చున్నార‌ని... చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్, మోడీ మూడు పార్టీల హీరోలు స్టేజిల‌పై నాట‌కాలు ఆడుతున్నార‌ని ఆరోపించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అన్న‌దాన్ని ప్ర‌జ‌లు మ‌ర్చిపోయారని అన్నారు. ఈ ముగ్గురు హీరోల‌ను విశాఖ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌పై మీరు ఎందుకు ప్రశ్నించ‌డంలేద‌ని అడిగారు. సీఎంలు మారినా కార్మికుల టెంట్లు ఇంకా అలాగే ఉన్నాయని వ్యాఖ్యానించారు. జగన్, పవన్ కల్యాణ్ ల‌కు మోడీతో స్నేహం ఉన్నా ప్రైవేటీక‌ర‌ణ మాత్రం ఆగ‌డం లేద‌న్నారు.

Next Story