బొమ్మల పిచ్చోడు జగన్.. ప్రజలు మరోసారి మోసపొవొద్దు : టీడీపీ అధినేత కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2024-01-09 11:33:55  IST  )

ఒక్క ఛాన్సంటూ అధికారంలోకి వచ్చి జగన్ రాయలసీమకు తీరని అన్యాయం చేశాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.

బొమ్మల పిచ్చోడు జగన్.. ప్రజలు మరోసారి మోసపొవొద్దు : టీడీపీ అధినేత కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్‌ : ఒక్క ఛాన్సంటూ అధికారంలోకి వచ్చి జగన్ రాయలసీమకు తీరని అన్యాయం చేశాడని, అభివృద్ధిలో సీమ అట్టడుగున నిలిచిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఇవాళ ఆళ్లగడ్డలో రా.. కదలిరా సభకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీ, ఎస్సీలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించకుండా వారి జీవితాలతో చలగాటం ఆడుతున్నాడని మండిపడ్డారు. జగన్ రాయలసీయ ద్రోహి అని.. మరోసారి అతడి మాటలను నమ్మొద్దంటూ ప్రజలకు తెలిపారు.

రానున్న రోజుల్లో రాయలసీమకు గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడున్న బీడు భూములను పచ్చని పంట పొలాలుగా మార్చే బాధ్యత తనదేనని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అసమర్థ ముఖ్యమంత్రి జగన్ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో వైసీపీ నాయకుల అరాచకాలకు అడ్డే లేదని అన్నారు. సీఎం జగన్‌కు బొమ్మల పిచ్చి పట్టుకుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి అన్నింటిపై ఆయన ఫొటో వేసుకుంటున్న జగన్ బొమ్మల పిచ్చోడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పేరు చెప్పుకుని బుట్టలో వేసుకునేందుకు జగన్ మళ్లీ ఓట్ల కోసం ప్రజల్లోకి వస్తున్నాడని, అందరూ వివేకంతో ఆలోచించి టీడీపీకి ఓటు వేయాలన్నారు.

Next Story