జగన్ ఫోన్ నెంబర్ కేసు.. ఈ నెల 28న కోర్టు తీర్పు

by Thanuru Gopichand |   (  Updated:2025-10-23 08:15:13  IST  )

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఫోన్ నెంబర్ కేసుపై హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో విచారణ పూర్తైంది.

జగన్ ఫోన్ నెంబర్ కేసు.. ఈ నెల 28న కోర్టు తీర్పు
X

దిశ, వెబ్ డెస్క్ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ (YS Jagan) ఫోన్ నెంబర్ కేసుపై హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో విచారణ పూర్తైంది. అయితే అక్టోబరు 1 నుంచి 30 మధ్యన యూరప్ (Europe) వెళ్ళాల్సి ఉందని జగన్ కోర్టులో పిటిషన్ వేశారు. ఫోన్ నెంబరు (Phone Number), ఈమెల్ ఐడీ సహా పర్యటన వివరాలను సమర్పించాలని సీబీఐ కోర్టు (CBI Court) షరతులు విధించి అనుమతులు జారీ చేసింది. అయితే జగన్ ఇచ్చిన ఫోన్ నెంబరు అతనిది కాదని సీబీఐ గుర్తించింది. తనది కాని నెంబర్ ఇవ్వడంపై అభ్యంతరం (Objection) వ్యక్తం చేసింది. ఆయన పర్యటనకు ఇచ్చిన అనుమతి రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. సీబీఐ మెమోపై విచారణ చేపట్టిన కోర్టు జగన్ తరపు న్యాయవాదిని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు కేసుకు సంబంధించిన తీర్పును ఈ నెల 28న వెలువరించనుంది.

READ MORE ...

మా హయాంలోనే విశాఖకు గూగుల్ డేటా సెంటర్‌ వచ్చింది: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

Next Story