- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SIT enquiry : సిట్ వేట.. జగన్ పీఏ ఇంట్లో సోదాలు?
ఏపీ లిక్కర్‌స్కాం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. విజయవాడ వెటర్నరీ కాలనీలో సిట్అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

మిగిలిన నిందితుల ఇళ్ళలోనూ తనిఖీలు
విజయవాడ వెటర్నరీ కాలనీలో..
మరో వైపు ముగ్గురు నిందితులకు సుప్రీం బెయిలు నిరాకరణ
ఏపీలో లిక్కర్‌స్కాం విచారణలో కీలక మలుపు
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ లిక్కర్‌స్కాం కేసు (AP Liquor Scam)) రోజుకో మలుపు తిరుగుతోంది. విజయవాడ వెటర్నరీ కాలనీలో సిట్అధికారులు తనిఖీలు చేస్తున్నారు.ఉదయం 10.30 గంటల నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ధనుంజయ్‌రెడ్డి, కష్ణమోహన్ నివాసాల్లో సిట్అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జగన్ (YS Jagan) వ్యక్తిగత సహాయ కార్యదర్శి కేఎన్ఆర్ నివాసంలోనూ సోదాలు చేస్తున్నారు. మరోవైపు ఏపీ మద్యం కుంభకోణంలో కేసులో నిందితులకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు నిందితులకు ముందస్తు బెయిలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కష్ణమోహన్‌రెడ్డి, ధనుంజరరెడ్డి, బాలాజీ గోవిందప్పకు మధ్యంతర ఉపశమనానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పటిప్పుడు మధ్యంతర రక్షణ ఇవ్వలేమని జస్టిస్పార్ధివాలా ధర్మాసనం తెలిపింది.
హైకోర్టులో పెండింగ్లో ఉండగానే పిటిషన్దాఖలు చేశారని పేర్కొంది. హైకోర్టు తుది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో విచారణ కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. అవసరం అనుకుంటే నిందితులు మరో పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ధర్మాసనం ఈనెల 13కి వాయిదా వేసింది. లిక్కర్స్కాంకు సంబంధించి ఈ రోజు టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్సీబీఐకి ఒక లేఖకూడా రాశారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్‌కే చేరాయంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు అరెస్టు అయి రిమాండ్‌లో ఉన్నారు. వారిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. విచారణలో బయటపడిన వాస్తవాల ఆధారంగా ఈ రోజు విజయవాడలో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.






