YS Jagan : మరోసారి జగన్ నెల్లూరు పర్యటన రద్దు

by Muthe.Rajitha |   (  Updated:2025-07-01 15:24:02  IST  )

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) నెల్లూరు పర్యటన(Nelluru Visit) మరోసారి రద్దయింది.

YS Jagan : మరోసారి జగన్ నెల్లూరు పర్యటన రద్దు
X

దిశ, వెబ్ డెస్క్ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) నెల్లూరు పర్యటన(Nelluru Visit) మరోసారి రద్దయింది. సెంట్రల్ జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జులై 3న జగన్ నెల్లూరు పర్యటనకు సిద్ధం కాగా.. ప్రభుత్వం హెలిప్యాడ్ కు అనువైన స్థలం ఇవ్వకపోవడంతో ఈ పర్యటన వాయిదా వేసుకున్నట్టు సమాచారం. హెలిప్యాడ్ వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని మరో 10 రోజుల్లో పర్యటన తేదీని వెల్లడిస్తారని సమాచారం. ఈ విషయాన్ని వైసీపీ నేతలు ధృవీకరించారు, త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

కాగా కాకాణి గోవర్ధన్ రెడ్డి పలు కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. జగన్ ఈ పర్యటన ద్వారా కాకాణికి సంఘీభావం తెలపాలని, అక్రమ అరెస్టును నిరసిస్తూ వైసీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి జైలు వద్ద నిరసన తెలపాలని భావించారు. అయితే, అనూహ్య పరిణామాల మధ్య పర్యటన వాయిదా వేయబడింది.

Next Story