ఎవరినీ వదిలిపెట్టం.. వారికి జగన్ మాస్​ వార్నింగ్​

by Thanuru Gopichand |

రేపు మేము అధికారంలోకి వస్తాం.. టీడీపీ నేతలకు సెల్యూట్​కొట్టి వారు చెప్పినట్లు చేసిన అధికారులను, అటువంటి నాయకులను వదిలిపెట్టం అంటూ జగన్​ సీరియస్​వార్నింగ్​ ఇచ్చారు.

ఎవరినీ వదిలిపెట్టం.. వారికి జగన్ మాస్​ వార్నింగ్​
X

దిశ డైనమిక్ బ్యూరో : రేపు మేము అధికారంలోకి వస్తాం.. టీడీపీ నేతలకు సెల్యూట్​కొట్టి వారు చెప్పినట్లు చేసిన అధికారులను, అటువంటి నాయకులను వదిలిపెట్టం అంటూ జగన్​ సీరియస్​వార్నింగ్​ ఇచ్చారు.కిడ్నాప్​కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్​ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజవాడ సబ్​జైలులో ఈ రోజు ఉదయం వైసీపీ అధినేత వైఎస్​జగన్​ కలిశారు. ఆయనతో జగన్​ ములాఖత్​ అయ్యారు. అనంతరం ఆయన జైలు నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు టోపీపై ఉన్న సింహాలకు సెల్యూట్ కొట్టండి.. టీడీపీ నేతలకు కాదన్నారు. వారు చెప్పినట్లు చేసి అన్యాయం చేస్తే బాగోదన్నారు అన్యాయం చేసిన ఈ అధికారులు, నాయకులందరినీ బట్టలు ఊడదీసి నిలబెడతాం అని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రిటైరైనా, సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తామన్నారు. చంద్రబాబు నాయుడు..వంశీని టార్గెట్ చేశాడని వైయస్ జగన్ ఆరోపించారు. ఈరోజు ఆయన విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి ఘటనకు వల్లభనేని వంశీకి ఇటువంటి సంబంధం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వంశీని టార్గెట్ చేశారని ఆరోపించారు. అందుకే కేసును రీఓపెన్ చేశారని అన్నారు. ఈ కేసులో వంశీని 71వ నిందితుడిగా చేర్చాలని అన్నారు. కూటమి నేతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని జగన్ మండిపడ్డారు. జగన్​ వెంట వంశీ భార్య పంకజశ్రీ, వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం ఉన్నారు. జగన్​ రాకతో జైలు ప్రాంగణం వద్ద కోలాహలంగా మారింది.

Next Story