నెట్‌వర్క్‌ను మొత్తం చేతుల్లోకి తీసుకున్నారు.. మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కూటమి ప్రభుత్వంపై వైసీపీ(YCP) అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు.

నెట్‌వర్క్‌ను మొత్తం చేతుల్లోకి తీసుకున్నారు.. మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కూటమి ప్రభుత్వంపై వైసీపీ(YCP) అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతోంది. ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు భ్రమలు తొలగిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యమంత్రికి పాలనమీద ధ్యాసలేదు. సొంత ఆదాయాలు పెంచుకోవడంమీదే ధ్యాస పెట్టారు. రాష్ట్రంలో విచ్చల విడిగా అవినీతి జరుగుతోందని జగన్ ఆరోపించారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయి. చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆయన బినామీల జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయని అన్నారు. వైసీపీ హయాంలో క్వాలిటీ చెక్‌ చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లోకి మద్యం వెళ్లేది. నిర్దిష్టమైన సమయాల్లోనే మాత్రమే లిక్కర్‌ అమ్మేవాళ్లం. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే నిర్వహించింది. కానీ.. ఇప్పుడు రాష్ట్రంలో కల్తీ లిక్కర్‌ మాఫియా నడుస్తోంది. దీని కోసం ప్రభుత్వ దుకాణాలను మూసేశారు. డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను మొత్తం చేతుల్లోకి తీసుకున్నారు. చంద్రబాబు(Chandrababu) హయాంలో రాక్షస పాలన నడుస్తోందని జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story