- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిట్ విచారణతో .. జగన్ గుండెల్లో గుబులు
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం జరిగిందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

- అధికారం అండతో వేల కోట్లు ప్రజాధనం కొల్లగొట్టారు
- జగన్ రెడ్డి పాలనలో ప్రపంచం విస్తుపోయేలా మద్యం కుంభకోణం జరిగింది
- దొంగలు దొరికిపోయి నేడు దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారు
- తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలి పెట్టేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం జరిగిందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu ravindra) అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణాలను హరించి జగన్ రెడ్డి (YS Jagan) తన ఖజానా నింపుకున్నాడని ఆరోపించారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మద్యం పాలసీలు అమలులో తప్పిదాలు జరిగాయంటూ పేదల బియ్యం బొక్కేసిన దొంగ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బెల్ట్ షాపులు గురించి మాట్లాడుతున్న పేర్ని నాని ఎక్కడున్నాయో చూపించాలని సవాల్ చేశారు. గత ఐదేళ్లు ప్రభుత్వ మద్యం షాపులు పేరుతో రాష్ట్రంలో జగన్ రెడ్డి దోపిడీకి తెరలేపితే, మచిలీ పట్నంలో బెల్టు రూపంలో పేర్ని నాని ప్రజల్ని పీక్కుతిన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మద్యం కుంభకోణం పై సీటు విచారణలో అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. కేసుల చొప్పున డిస్లరీల నుండి కమిషన్లు దండుకున్నారు.
జాతీయ అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను తరిమేసి తమకు కమిషన్లు ఇచ్చే కల్తీ బ్రాండ్లకు మాత్రమే రాష్ట్రంలో అనుమతించారు. వాటిని మాత్రమే షాపుల్లో అందుబాటులో ఉంచారు. ఈ అక్రమాలన్నీ పరిశీలించిన తర్వాతే సిట్ అరెస్టులు చేసిందన్నారు. సిట్ విచారణతో జగన్గుండెల్లో గుబులు మొదలైందని తెలిపారు. ప్రజలు చీత్కరించినా జగన్ రెడ్డిలో మార్పు రాలేదు. అధికారులను బెదిరించి తప్పులు చేసి ఇప్పుడు ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తున్నారు. జగన్ దోపి డీకి సహకరించిన అధికారులంతా జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. ఆధారాలతో సహా దొరికిపోయిన కేసులో ప్రజల్ని మభ్యపెట్టేందుకు తన అవినీతి పత్రికను వాడుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో ప్రజా సమస్య లకు పరిష్కారం లభిస్తోంది. ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిత్యం తపించే ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని . . గ్రామ స్థాయి నుండి సమస్యలపై చర్చించి ఆ మేరకు రాష్ట్ర స్థాయి మహానాడులో తీర్మానాలు చేస్తామన్నారు.






