జగన్ నీ ఆటలు ఇక సాగవ్... వైసీపీని నామ రూపాలు లేకుండా చేస్తాం: Kinjarapu Atchannaidu

by Seetharam |   (  Updated:2023-08-30 05:26:30  IST  )

తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇసుక సత్యాగ్రహంతో నాలుగేళ్లుగా జగన్ రెడ్డి చేస్తున్న ఇసుక దందా గుట్టు బట్టబయలైంది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

జగన్ నీ ఆటలు ఇక సాగవ్... వైసీపీని నామ రూపాలు లేకుండా చేస్తాం: Kinjarapu Atchannaidu
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇసుక సత్యాగ్రహంతో నాలుగేళ్లుగా జగన్ రెడ్డి చేస్తున్న ఇసుక దందా గుట్టు బట్టబయలైంది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అక్రమాలు బయట పడతాయని భయంతోనే టీడీపీ నేతలను జగన్ రెడ్డి హౌస్ అరెస్టులు చేయిస్తున్నాడు అని ఆరోపించారు. ఇసుకలో అక్రమాలు లేకుంటే టీడీపీ నేతలను ఎందుకు అరెస్టు చేస్తున్నారు అని నిలదీశారు. అరెస్టులతో టీడీపీ పోరాటాన్ని ఆపలేరు అని హెచ్చరిస్తూ బుధవారం అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. జగన్ రెడ్డీ.... నీ తండ్రి అధికారాన్ని వాడుకుని లక్ష కోట్లు దోచుకున్నావ్. నీవు అధికారంలోకి వచ్చాక మద్యం, ఇసుక, భూములు అంటూ లక్షల కోట్లు దోచేశావ్. ఇంకా పేదల కడుపు కొట్టి చేసిన దోపిడీకి నేటి అరెస్టులు నిదర్శనం అంటూ తీవ్ర వ్యాక్యలు చేశారు. ఇకపై నీ ఆటలు సాగవు. తక్షణమే టీడీపీ నేతల్ని వదిలిపెట్టు అని ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు అనుమతించాలి. అలా కాకుండా అణచివేయాలని ప్రయత్నిస్తే ఉవ్వెత్తున ఎగసి నీ ప్రభుత్వాన్ని నామ రూపాలు లేకుండా చేస్తాం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Next Story