- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రానికి రాజధాని అవసరం లేదన్న జగన్.. ప్యాలెస్ లు కట్టుకున్నారు
అభివృద్ధి పనులను అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రానికి రాజధాని అవసరం లేదన్న మాజీ సీఎం వైయస్ జగన్ (YS Jagan) తనకోసం మాత్రం ప్యాలెస్ లు కట్టుకున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Rama Narayana Reddy) అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి మంగళవారం పర్యటించారు. అనంతసాగరం మండలం ఎగువపల్లి గ్రామంలో విపిఆర్ అమృతధార మినరల్ వాటర్ ప్లాంట్లను (Amritha Dhara Mineral Water Plant), సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. మర్రిపాడు మండలం రాజుపాలెం గ్రామంలో వాటర్ ప్లాంట్, సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మర్రిపాడు సాగు, తాగునీరు లేని మెట్టప్రాంతమని పేర్కొన్నారు. అటువంటి ప్రాంతానికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
రాష్ట్రానికి రాజధాని అవసరం లేదని చెప్పిన వైయస్ జగన్ తన కోసం మాత్రం ప్యాలెస్ లు నిర్మించుకున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్, బెంగళూరుల్లో ప్యాలెస్ లు నిర్మించుకున్నారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వివాదం నేపథ్యంలో మాట్లాడుతూ.. సోమశిల, కండలేరు వెళ్లి వైసీపీ నాయకులు ఏం చూస్తారని ప్రశ్నించారు. రెండు జలాశయాలు నిండు కుండల్లా ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు అడ్డుపడొద్దని హితవు పలికారు.






