- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కలలో కూడా ఊహించలే’.. ఎన్నికల్లో ఘోర ఓటమిపై సీఎం జగన్ ఎమోషనల్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని రిజల్ట్స్ వెలువడ్డాయి. కళలో కూడా ఎవరూ ఊహించని అఖండ విజయం దిశగా టీడీపీ,

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని రిజల్ట్స్ వెలువడ్డాయి. కళలో కూడా ఎవరూ ఊహించని అఖండ విజయం దిశగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దూసుకుపోతుంది. అధికార వైసీపీ కేవలం తొమ్మిది స్థానాలకు మాత్రమే పరిమితమై ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఇంత వరకు ఏ పార్టీ చవిచూడని ఘోర ఓటమిని మూట గట్టుకుంది. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత, సీఎం జగన్ తొలిసారి స్పందించారు. తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఫలితాలు వస్తాయని అస్సలు ఊహించలేదని ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
మంచి చేసినా ఓటమి పాలయ్యామని.. అయిన ప్రజల తీర్పును శిరస్సా వహిస్తానని స్పష్టం చేశారు. అమ్మవడితో కోటి 53 లక్షల మంది అక్కాచెల్లళ్లకు మంచి చేశామని, అరకోటి మంది రైతుల అప్యాయత ఏమైందో తెలియడం లేదని ఫీల్ అయ్యారు. ఐదేళ్ల పాలనలో నేతన్నలు, మత్య్సకారులు అన్ని వర్గాలకు మంచి చేశామని గుర్తు చేశారు. మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి అందులో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని చెప్పారు. సామాజిక న్యాయం అమలు చేస్తూ ఏపీ ప్రజలు శ్రేయస్సు కోసం ప్రతిక్షణం పని చేశామని తెలిపారు.






